సంబంధిత వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ హీరో నిఖిల్-పల్లవి
- నాంది కంటే పదిరెట్లు ఉగ్రంని ఆదరించాలని కోరుకుంటున్నా : అల్లరి నరేష్
- నిఖిల్ స్పై నాన్-థియేట్రికల్ హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయి
- చిరంజీవి నివాసంలో భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో రామ్చరణ్ పుట్టినరోజు విందు
- కార్తికేయ 2తో నిఖిల్ సిద్ధార్థ కి జాతీయ స్థాయిలో పాపులర్ ఛాయిస్ అవార్డ్
నిఖిల్ స్పై చిత్రంలో సుభాష్ చంద్రబోస్ రహస్యాలు
nikhil-spy
ఢిల్లీలో చారిత్రాత్మకం ఈవెంట్ చోటు చేసుకోనుంది. స్పై టీజర్ మే 15న కర్తవ్య పథ్(రాజ్ పాత్)లో విడుదల కానుంది. ఈ ఐకానిక్ ల్యాండ్ మార్క్ లో మూవీ టీజర్ లాంచ్ కావడం ఇదే తొలిసారి. కౌంట్ డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతున్నందున మీ క్యాలెండర్ లను మార్క్ చేసుకోండి. అందరి తో పంచుకోండి. అద్భుతమైన ఘట్టం ఒకటి తెరపైకి రాబోతోందని అందరికీ తెలియజేయండి.
ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి, సి ఇ ఓ గా చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించారు.
నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ సెకండ్ ఫిమేల్ లీడ్ లో పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోంది. ఆర్యన్ రాజేష్ తన కమ్ బ్యాక్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఈ కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
స్పై ఈ ఏడాది జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
