1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Theme music from Vishal Samanyudu

విశాల్ సామాన్యుడు నుంచి థీమ్ మ్యూజిక్

Vishal
Visal action scean
విశాల్  ‘సామాన్యుడు’ చిత్రంతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు.
 
విశాల్ గత చిత్రాలకు పని చేసి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన యువన్ శంకర్ రాజా సామాన్యుడు సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి థీమ్ మ్యూజిక్‌ను విడుదల చేశారు. ఇందులోని లిరిక్స్ ఎంతో స్పూర్తివంతంగా ఉన్నాయి. ఈ పాటను నివేదిత ఆలపించారు.
 
డింపుల్ హయతి ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 
యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా.. కెవిన్ రాజా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
About Writer
ముర‌ళీకృష్ణ‌
తర్వాతి కథనం
అలాంటి సినిమాలే నిర్మిస్తాః నిహారిక కొణిదెల