1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Budugu movie ready for Release

మంచు లక్ష్మీ బుడుగు రిలీజ్‌కు సిద్ధం..!

Budugu movie ready for Release
మంచు లక్ష్మీ ప్రసన్న బుడుగు సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. సైకలాజికల్ థ్రిల్లర్ అయిన బుడుగు సినిమాకు మన్మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మాస్టర్ ప్రేమ్, ఇంద్ర, శ్రీధర్ రావుల చుట్టూ తిరుగుతుందని సినీ యూనిట్ పేర్కొంది. 
 
మంచు లక్ష్మీ ఇందులో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, మాస్టర్ ప్రేమ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడని దర్శకుడు తెలిపారు. 
 
ఉద్యోగాలతో బిజీ బిజీగా గడుపుతున్న తల్లిదండ్రులకు పిల్లలపై శ్రద్ధ చూపించడానికి టైమ్ లేకుండా పోతుంది. అలా మాస్టర్ ప్రేమ్ (బన్నీ) ప్రవర్తనతో జరిగే పరిణామాలు, థ్రిల్లర్ అంశాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు వెల్లడించారు. 
About Writer
Selvi