సంబంధిత వార్తలు
- మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?
- పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)
- లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలలో పొట్టి ఓవర్ల క్రికెట్.. ఆరు జట్లకు స్థానం
- పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)
- భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?
విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్
Goat
ఈ వీడియోలో అనేక కేబుల్ లైన్లు, విద్యుత్ స్తంభాలతో కూడిన రహదారిని చూడవచ్చు. భూమి నుంచి ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కరెంట్ తీగపై నిలబడి ఉన్న మేకను జూమ్ చేస్తుంది. కేబుల్ వైర్‌కు తగులుకున్న గడ్డి తినడానికి ఆ మేక ముందుకు వంగి కనిపిస్తుంది.
ఈ సంఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం తెలియరాలేదు. కానీ ఈ వీడియోను చూసిన వారంతా షాకవుతున్నారు. కరెంట్ తీగపై ఆ మేక ఎలా ఎక్కింది. అలా ఎక్కి ఏమాత్రం భయం లేకుండా గడ్డిని ఎలా మేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేకలు తరచుగా చెట్లు, కొండలను ఎక్కుతాయి. కానీ విద్యుత్ తీగలపై నిలబడిన ఆ మేక భయం లేకుండా ఎలా వుండగలుగుతోందని అడుగుతున్నారు. ఈ మేకను చూస్తూ వీధి జనం అవాక్కయ్యారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మేక ఎలా పైకి చేరుకుంది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "ఇది AI- జనరేటెడ్ వీడియో" అని మరొకరు చెప్తున్నారు.
GOAT???? pic.twitter.com/QdlxiQ5Hur
— rareindianclips (@rareindianclips) April 8, 2025
