1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Shock to Adani, loss of Rs 55,000 crore just in one hour

అదానీకి షాక్‌.. గంటలో రూ.55వేల కోట్ల నష్టం

Shock
ముంబయి: ఆసియా అపర కుబేరుడు గౌతమ్‌ అదానీకి నేషనల్ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌) షాకిచ్చింది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను స్తంభింపజేసింది. ఈ మేరకు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. ఈ వార్తలతో నేటి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అదానీ గ్రూప్‌ షేర్లు కుప్పకూలాయి. కేవలం గంట వ్యవధిలోనే షేర్లన్నీ ‘లోయర్‌ సర్క్యూట్‌’ను తాకాయి. దీంతో అదానీ నికర సంపద 7.6 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.55వేల కోట్లు) మేర ఆవిరైపోయింది. 
 
ఎన్‌ఎస్‌డీఎల్‌ స్తంభింపజేసిన అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లకు.. అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు కంపెనీల్లో రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అయితే మనీ లాండరింగ్‌ నివారణ చట్టం ప్రకారం.. ఈ ఖాతాల యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. దీంతో మే 31 లేదా అంతకంటే ముందే ఈ ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది.
తర్వాతి కథనం
కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ