సంబంధిత వార్తలు
- ప్రేమించి పెళ్లాడిన భార్యకు కరోనా అని తెలియగానే.. పారిపోయిన భర్త.. ఎక్కడ?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో రియా చక్రవర్తి ఎందుకు విలన్ అయ్యారు? - అభిప్రాయం
- స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై పూర్తి విచారణకు బాబు డిమాండ్.. సీఎం జగన్ ఓకే
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం.. ఫడ్జ్ దీనంగా ఎదురుచూపులు.. ఎవరు?
- సుశాంత్ డైరీలో కొన్ని పేజీలు ఏమయ్యాయి..? (video)
#SushantWasMurdered సుశాంత్ ఉరేసుకుంటే కాళ్లు ఎలా వంగుతాయ్..?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మృతి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొలుత సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు భావించినా..ఆ తర్వాత ఇది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా హత్యే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సుశాంత్ సన్నిహితులు దీన్ని హత్యే అని చెప్పారు. తాజాగా సుశాంత్ మృతదేహాన్ని ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లిన అంబులెన్స్ సహాయకుడు చెప్పిన మాటలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.
సుశాంత్ మృతదేహాన్ని మొదట చూసినపుడు పసుపుపచ్చ రంగులో ఉంది. ఒకవేళ ఉరివేసుకుంటే శరీరం రంగు మారదు. నోటి నుంచి నురగ వస్తుంది. కానీ నేను సుశాంత్ బాడీపై ఎలాంటి నురగ చూడలేదు. ఎవరైనా ఉరివేసుకుంటే మెడచుట్టూ గుర్తులుంటాయి. కానీ కేవలం ముందుభాగంలో మాత్రంలో గుర్తు కనిపించింది. అంతేకాదు సుశాంత్ కాళ్లు వంగి ఉన్నాయి.
ఎవరైనా ఉరేసుకుంటే కాళ్లు ఎలా వంగిపోతాయని ఆంబులెన్స్ సహాయకుడు తెలిపాడు. సుశాంత్ కాలిపై తనకు ఓ గుర్తు కనిపించిందని చెప్పుకొచ్చాడు. సహాయకుడు చెప్పిన మాటలు బట్టి చూస్తే సుశాంత్ హత్య ఉంటుందనే అనుమానాలు వస్తున్నాయి. సుశాంత్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం #SushantWasMurdered అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
