ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ రసాభాసగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించింది. దీంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. పైగా, ప్రతిపక్షాల వల్లే వాలంటీర్లను పంపిణీ చేయలేకపోతున్నామంటూ దుష్ప్రాచారం చేస్తూ, లబ్ధిదారుల్లో సానుభూతిపొంది ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న తపనతో ఉంది. దీంతో రెండో తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన పింఛన్లు సక్రమంగా పంపిణీ కావడం...