బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (15:28 IST)

కూచిపూడి భామాకలాపం.. నృత్యం చేసిన మంత్రి ఆర్కే రోజా (video)

rk roja
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూచిపూడిలో ప్రఖ్యాత భామాకలాపం ప్రదర్శించగా, ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. కూచిపూడిలో భామాకలాపంలో నృత్యం చేశారు. తన స్టెప్పులతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 
 
అక్టోబరు 15న ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రోజా పాల్గొన్నారు. 
 
ఇకపోతే... విశాఖ గర్జనలో పాల్గొన్న మంత్రి రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.