1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 307 special buses for Mahashivaratri in Kadapa district

కడప జిల్లాలో మహాశివరాత్రికి 307 ప్రత్యేక బస్సులు

special buses
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడపజిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మార్చి 10, 11, 12 తేదీల్లో 307 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు.

ఈ బస్సులు కడప రీజియన్‌ పరిధిలోని 8 డిపోలు (కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, పులివెందు ల, బద్వేలు) నుంచి బయల్దేరనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు తాగునీటిని డిపోల్లో, శైవక్షేత్రాల్లో సిద్ధం చేస్తున్నారు.

అలాగే ప్రభుత్వం ముందస్తుగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయనుంది. ఈ బస్సులు పొలతల, లంకమల, బ్రహ్మంగారిమఠం, కన్యతీర్థం, సంగమేశ్వర దేవాలయాలు, జ్యోతి, నిత్యపూజకోన, తలకోన, భానుకోట, హత్యరాల, అగస్తేశ్వరకోన, అల్లాడుపల్లె దేవాలయాలు తదితర శైవక్షేత్రాలకు వెళ్లనున్నాయి. 
తర్వాతి కథనం
నేడు కుప్పంలో చంద్రబాబు