బాలుడుపై హాస్టల్ వార్డెన్ లైంగిక దాడి.. ఎక్కడ?

boy sexual attack
Last Updated: ఆదివారం, 13 జనవరి 2019 (10:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ రూరల్ జిల్లాలో ఓ హాస్టల్‌లో చదువుతున్న బాలుడుపై ఆ హాస్టల్ వార్డెన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

రూరల్ జిల్లాలోని మావల మండలంలోని శివారు ప్రాంతంలో ఓ కార్పొరేట్ పాఠశాలకు చెందిన స్కూల్‌కు అనుబంధంగా హాస్టల్ కూడా ఉంది. ఈ హాస్టల్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ బాలుడుపై హాస్టల్ వార్డెన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలుడు తోటి విద్యార్థులకు, వసతి గృహాం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.

శుక్రవారం పాఠశాలకు చేరుకున్న వారు జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆగ్రహించిన పోషకులు పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మావల ఎస్సై పాఠశాలకు చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాలుడి పోషకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.దీనిపై మరింత చదవండి :