తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 7వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరెవరో తేలిపోయింది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ఘట్టాలు ముగిసిపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రటించింది. ఈ నేపథ్యంలో అదిలాబాద్ జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే,
1. సిర్పూర్ : కోనేరు కోనప్ప (తెరాస), పాల్వాయి హరీశ్ (కాంగ్రెస్), డాక్టర్ కె. శ్రీనివాస్ (బీజేపీ), రావి శ్రీనివాస్ (బీఎస్పీ).
2. చెన్నూరు : బాల్క సుమన్ (తెరాస), బోరకుంట్ల వెంకటేశ్ నేత (కాంగ్రెస్), ఎ.శ్రీనివాసులు (బీజేపీ), బోడ జనార్దన్ (బీఎస్పీ).
3. బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య (తెరాస), గుండా మల్లేశ్ (సీపీఐ), కొయ్యల ఎమాజీ (బీజేపీ), గడ్డం వినోద్ (బీఎస్పీ).
4. మంచిర్యాల : నడిపెల్లి చివాకర్‌రావు (తెరాస), కొక్కిరాల ప్రేంసాగర్‌రావు (కాంగ్రెస్), వీరబెల్లి రఘనాథరావు (బీజేపీ), సత్యనారాయణ (బీఎస్పీ).
5. ఆసిఫాబాద్ : కోవలక్ష్మీ (తెరాస), ఆత్రం సక్కు (కాంగ్రెస్), అజ్మీరా ఆత్మారాంనాయక్ (బీజేపీ), కే విజయ్ (టీజేఎస్).
6. ఖానాపూర్ : రేఖానాయక్ (తెరాస), రమేశ్ రాథోడ్ (టీడీపీ), సట్ల అశోక్ (బీజేపీ), భీంరావు (టీజేఎస్).
7. ఆదిలాబాద్ : జోగు రామన్న (తెరాస), గండ్రత్ సుజాత (కాంగ్రెస్), పాయల శంకర్ (బీజేపీ), సత్యనారాయణ (బీఎస్పీ).
8. బోధ్ : రాథోడ్ బాబూరావు (తెరాస), సోయం బాపూరావు (కాంగ్రెస్), మాడవి రాజు (బీజేపీ), అనిల్ జాదవ్ (కాంగ్రెస్ రెబెల్)
9. నిర్మల్ : అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (తెరాస), ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్), స్వర్ణారెడ్డి (బీజేపీ), ఆలివేలు మంగ (బీఎల్‌ఎఫ్).
10. ముథోల్ : జి.విఠల్‌రెడ్డి (తెరాస), రామారావు పటేల్ పవార్ (కాంగ్రెస్), పదకంటి రమాదేవి (బీజేపీ), నారాయణరావు పటేల్ (ఎస్‌సీసీ)