ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర పంచాయతీ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిల తీరును హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహాయ, సహకారాలు అందించాలని ఆదేశిస్తూ గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ముఖ్యంగా, ఎస్ఈసీకి మంజూరైన పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోలేదని, నిధులు మంజూరు చేయలేదని ఆక్షేపించింది. కోర్టు ఉత్తర్వులను అధికారులు సరైన...