సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (15:08 IST)

తితిదే ఈఓకు చేతులు జోడించి దణ్ణం పెట్టిన సీఎం...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారి ఒక ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఐఎఎస్‌‍ అధికారికి. అలా ఇలా కాదు దేశ ప్రథమ పౌరుడికి ఎలాగైతే దణ్ణం పెడతారో.. అలాగే చంద్రబాబు ఆ ఐఎఎస్‌కు దణ్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారి ఒక ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఐఎఎస్‌‍ అధికారికి. అలా ఇలా కాదు దేశ ప్రథమ పౌరుడికి ఎలాగైతే దణ్ణం పెడతారో.. అలాగే చంద్రబాబు ఆ ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాథ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
 
తిరుపతి పర్యటనకు వచ్చిన రాష్ట్రపతిని తిరుమలలో బస చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్, టిటిడి ఈఓతో పాటు పలువురు మంత్రులు, అధికారులు వెళ్ళారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులందరూ ఒకే గదిలో ఉన్నారు. ఆ గదిలోకి టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ లోపలికి వస్తుండగా చంద్రబాబునాయుడు రెండు చేతులు జోడించి నమస్కరించారు. 
 
ఈఓ మాత్రం వికటాట్టహాసంతో చంద్రబాబు నాయుడును పలుకరించి ఆ తర్వాత అక్కడ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఒక ముఖ్యమంత్రి  ఐఎఎస్‌కు నమస్కరిస్తే ఆయన కనీసం తిరిగి నమస్కరించకుండా వెళ్ళిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.