1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (14:57 IST)

ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు. 
 
కాగా ఇప్పటివరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలం మార్చి 31తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. 
 
రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించగా.. నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఖరారు చేశారు.