సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (14:53 IST)

ఇంట్లో దింపే ఆటో డ్రైవరే కీచకుడు.. ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం

ప్రతి రోజూ ఎంతో నమ్మకంతో ఇంటి నుంచి పాఠశాలకు.. పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చే ఆటో డ్రైవరే కీచకుడుగా మారిపోయాడు. తన ఆటోలో ప్రతి రోజూ ప్రయాణించే ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హైద

ప్రతి రోజూ ఎంతో నమ్మకంతో ఇంటి నుంచి పాఠశాలకు.. పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చే ఆటో డ్రైవరే కీచకుడుగా మారిపోయాడు. తన ఆటోలో ప్రతి రోజూ ప్రయాణించే ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.
 
హైదరాబాద్, నాంపల్లి గ్లోబల్‌ టెక్నో స్కూల్‌లో ఆరేళ్ళ చిన్నారి విద్యాభ్యాసం చదువుతోంది. గత రెండు నెలలుగా పాపను పాఠశాల నుంచి ఇంట్లో దింపుతున్న ఆటో డ్రైవర్‌ నయీం ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలి తండ్రి ఆరోపించాడు. శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగిందనీ, ఆటోను బజార్‌ఘాట్‌ వైపుకు తీసుకెళ్లిన నయీం చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.