1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Bopparaju comments on PRC

పీఆర్సీపై బొప్పరాజు ఏమన్నారంటే? పాత జీతాలే ఇవ్వమన్నారు..

Bopparaju
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు కూడా అలానే వున్నారని.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం వద్దు కానీ.. ఆర్టీసీ ఆదాయం మాత్రం కావాలా..? అని ఆయన ప్రశ్నించారు. 
 
పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు.. ప్రమోషన్లు తక్షణం చేపట్టాలని బొప్పరాజు డిమాండ్ చేశారు, ఆర్టీసీ ఆస్పత్రులన్నీ అప్డేట్ చేయాలన్నారు. 
 
మేం చర్చలకు వెళ్లినా.. చర్చలకు రాలేదని ప్రభుత్వం మమ్మల్ని తప్పు పడుతోందని బొప్పరాజు చెప్పారు. జీతాలు ఇవ్వకుంటే ఉద్యోగుల్లో అన్ రెస్ట్ వస్తుందని ప్రభుత్వం భావిస్తోందేమో..? వచ్చే నెల 1న పాత జీతాలే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీపై క్లారిటీ వచ్చే వరకు పాత జీతాలే ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు.
తర్వాతి కథనం
దేశంలో ఎక్కడా ఇలా జరగలేదు.. ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడమా?