శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:28 IST)

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోంది: చింతామోహన్

తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో తను భారీ విజయం సాధిస్తానని మాజీ ఎంపి, కాంగ్రెస్ పార్టీ తిరుపతి అభ్యర్థి చింతామోహన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే... ఎన్నికల పొత్తులో భాగంగా బిజెపి జెండా ఎత్తుకున్న జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తన 12  ప్రశ్నలకు సమాదానము చెప్పాలి.
 
తిరుపతి పార్లమెంట్ పరిధిలో మన్నవరం, దుగరాజపట్టణం ఓడరేవు సహ అనేక ప్రాజెక్టులను బిజెపి ఆపింది, అలాంటి పార్టీకి ఓట్లు వెయ్యమని, పవన్ కళ్యాణ్ ఎలా అడుగుతాడు?? వైఎస్ వివేక హత్య రాజకీయ హత్య అని ఆయన కుమార్తె డిల్లీలో మీడియా మందు చెప్పింది. ఆమె వ్యాఖ్యలు బాధ కలిగించాయి.
 
వివేక హత్యపై సీయం జగన్ నోరు విప్పాలి. వివేకా కూతురు మాటలకు జగన్ కచ్చితంగా సమాదానము చెప్పాలి. వివేకా హత్యకు ఎవరు బాధ్యత వహిస్తారు?? సీయం వద్ద నిఘా నివేదికలు ఉన్నాయి. వివేకా కూతురికి జగన్ కచ్చితంగా సమాధానము చెప్పి తీరాలి. 24 గంటలలో సమాదానము చెప్పకపోతే ముఖ్యమంత్రి జగన్ పైన అనుమానపడాల్సి వస్తుంది. వివేక హత్య కేసు విచారణ ఆలస్యంగా జరుగుతోంది. సీబిఐకి మంత్రి అయిన ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ సైతం వివేక హత్యపై స్పందించాలి.