శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:20 IST)

ఈ 60 వేల రూపాయలు తీసుకుని గ్రామ ప్రజలకు తాగునీళ్లవ్వండి: జగ్గారెడ్డి

కొండాపూర్ మండలం మాన్సన్ పల్లి గ్రామ మంచి నీటి సమస్యపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులతో మాట్లాడారు. మిషన్ భగీరథకి సంబంధించి మిగిలిన కొద్ది పనులకు గాను కాంట్రాక్టర్‌కి స్వయంగా 60 వేల రూపాయలు ఇచ్చారు.
 
పనులు త్వరగా పూర్తి చేసి గ్రామ ప్రజలకు నీరు అందించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పదిహేను రోజుల్లో మాన్సన్ పల్లి గ్రామ ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యేకు అధికారులు తెలిపారు.