బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (20:35 IST)

కరోనా వచ్చిందని ఊళ్లోకి రానివ్వట్లేదు, పొలంలోనే బిక్కుబిక్కుమంటూ

కరోనా వచ్చిందని ఊరిబయటే...
అదిలాబాద్ జిల్లా-ఇంద్రవెల్లి: కరోనా కారణంగా ఓ విద్యార్థినిని ఊళ్ళోకి రానివ్వకపొవడంతో భయం గుప్పిట్లో గడుపుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం, సాలేగూడకు చెందిన సోన్ దేవి గురుకుల కాలేజీలో ఇంటర్ చదువుతూ కరోనా బారిన పడింది.
 
కరోనా రావడంతో ఆమె సొంత ఊరుకు బయలుదేరి వచ్చింది. ఐతే ఆమెను ఊర్లోకి రాకుండా గ్రామస్థులు అడ్డుపడ్డారు. క్వారంటైన్ పూర్తయితేనే అనుమతిస్తామని చెప్పడంతో సోన్ దేవి ఊరి చివర్లో ఉన్న తమ పాలంలోనే ఐసోలేషన్లో ఉంటోంది. మరో 4 రోజులు పూర్తయ్యాకే ఊళ్లో అడుగుపెట్టనిస్తామని తేల్చి చెప్పారు.