బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (19:33 IST)

ఏపీలో కొత్తగా 218 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,165 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 218 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,92,740కి చేరింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,186 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 117 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,83,759కి చేరింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 1,795 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,46,42,664 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.