బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 మే 2020 (19:44 IST)

జూలై నుండి మచిలీపట్నంకు ప్రతి రోజు తాగు నీరు: మంత్రి పేర్ని నాని

జూలై నెలనుండి మచిలీపట్నం పుర ప్రజలకు ఇప్పటివలే రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజూ స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని)తెలిపారు.

ఇక నుంచి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానంతో స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ కానుందని ఆయన అన్నారు.

స్థానిక రాజుపేట కేశవరావు తోట ప్రాంతం లో నూతనంగా నిర్మించిన రాపిడ్ సాండ్ ఫిల్టర్స్ సముదాయాన్ని మంత్రి నిరాడంబరంగా ప్రారంభించారు.

ఈ విధానంతో పట్టణ ప్రజలకు సమృద్ధిగా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా కానుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలకసంస్థ కమీషనర్ శివరామకృష్ణ, ఎంఇ త్రినాధ్ రావు, డీఇ, ఏఇ లు, సిబ్బంది పాల్గొన్నారు.