మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (07:58 IST)

మచిలీపట్నం-విశాఖపట్నం.. అట్టహాసంగా ఇంద్ర ఎ. సి బస్సు సర్వీసు ప్రారంభం

ఎ.పి.ఎస్.ఆర్.టి.సి నూతనంగా ప్రవేశ పెట్టిన మచిలీపట్నం-విశాఖపట్నం 'ఇంద్ర' ఎ. సి. బస్సు సర్వీసు ప్రప్రథమంగా రాష్ట్ర రవాణా మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని), పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మచిలీపట్నంలో ప్రాంభించారు.
 
 ఈ బస్సు సర్వీసు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు అలాగే విశాఖపట్నం నుండి రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది. మచిలీపట్నం, గుడివాడ, కలిదిండి, భీమవరం, కాకినాడ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం నుండి చీరాల వరకు ఉదయం 5 గంటలకు, మధ్యాన్నం 1.30 గంటలకు అల్ట్రా డీలుక్స్ సర్వీసులు కూడా రాష్ట్ర మంత్రి ప్రారంభించారు.