ఎవరి ప్రయోజనాల కోసం పోలవరం కాంట్రాక్టర్‌కు నోటీసులు?... కెఎస్‌ జవహర్‌

jawahar
ఎం| Last Updated: గురువారం, 1 ఆగస్టు 2019 (19:47 IST)
ఎవరి ప్రయోజనాల కోసం పోలవరం కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు.

"పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి రాష్ట్రం సస్యశ్యామలం కావడం జగన్మోహన్‌రెడ్డికి ఇష్టం లేదు. శరవేగంగా జరుగుతున్న పనులను అడ్డుకునేందుకు రోజుకో నాటకానికి జగన్‌ తెరలేపుతున్నారు. ఒక సారి బిల్లులు చెల్లించమని, మరోసారి రాష్ట్రానికి సంబంధం లేదని చెబూత ఇప్పుడు ప్రాజెక్టు పనుల నుండి కాంట్రాక్ట్‌ సంస్థను వైదొలగాలని నోటీసులు ఇవ్వడం దేనికి సంకేతం?

పోలవరం ప్రాజెక్టులో అతి కష్టమైన కాంక్రీట్‌ పనుల్లో నష్టమొచ్చినా సరే పనులకు ఎక్కడా అవాంతరం కలగకుండా రికార్డు స్థాయిలో పనులను పూర్తి చేసిన నవయుగ ఎన్నో మన్నలను పొందింది. దుబాయి కాంక్రీట్‌ పనుల రికార్డును అధిగమించి గిన్సీస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది. 38 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకు గాను దాదాపు 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తి చేసింది.

దేశంలో ఉన్న 16 జాతీయ ప్రాజెక్టు పనులు నత్తనడక నడుస్తుంటే పోలవరంలో 71% పనులు పూర్తి కావడంలో కీలక పాత్ర నవయుగకే దక్కుతుంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క క్యూబిక్‌ మీటర్‌ కాంక్రీట్‌ పనికి సుమారు రూ.5,700 కాంట్రాక్టర్‌కు చెల్లించింది. కాని నవయుగకు మాత్రం ఒక్క క్యూబిక్‌ మీటర్‌కు కేవలం రూ.2,700 మాత్రమే తీసుకుంటుంది. అటువంటి సంస్థను తొలగించేందుకు ప్రయత్నించటం సరికాదు.

దేశంలోనే అతి తక్కువ రేటు తీసుకుంటూ అతి వేగంగా పనులు పూర్తి చేసిన నవయుగకు జగన్‌ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం ఎవరి ప్రయోజనాల కోసం? ఇది చట్ట వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకం. జగన్‌ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పూర్తిగా
ఆర్‌అండ్‌బి ఇంజనీర్‌గా ఉన్న ఆయన బంధువు ఆధ్వర్యంలో జలవనరులకు నివేదిక ఇవ్వడం అంటేనే కేవలం వాళ్ల వాళ్లకు కావాల్సిన విధంగా రిపోర్టు రాసుకున్నారనేది వాస్తవానికి భిన్నమైంది.


నవయుగపై దుష్ప్రచారం చేసి ఆ కాంట్రాక్టర్‌ను రద్దు చేసి ఆ స్థానంలో జగన్‌కు అనుకూలమైన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేందుకు కుట్రలో భాగంగానే నవయుగకు నోటీసులు జారీ చేశారు. ఇటువంటి అనాలోచిత చర్యల వలన పోలవరం ప్రాజెక్టు నిర్మానం పూర్తి మరింత ఆలస్యం అయ్యి ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయి.

2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం పోలవరం హెడ్‌ వర్క్స్‌ పనులు చేస్తున్న మథుకాన్‌ కాంట్రాక్టర్‌ను రద్దు చేసింది. తిరిగి మళ్లీ కాంట్రాక్ట్‌ పనులు ప్రారంభించటానికి దాదాపు 4 ఏళ్లు సమయం పట్టింది. పోలవరం పనులు ఆలస్యం కావడానికి ఆనాడు వైఎస్‌ కారణం అయితే నేడు జగన్‌ కారణం అవుతున్నారు. 13 జిల్లాల రైతుల ప్రయోజనాలు, పారిశ్రామిక నీటి అవసరాలను దెబ్బగొడుతున్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరం కాంక్రీట్‌ పనులు అదే విధంగా డయాఫ్రంవాల్‌, కాఫర్‌ డ్యాం, జట్‌ గ్రౌటింగ్‌ పనులు పూర్తి అయ్యాయి. ఇంకా మెజారిటీ మట్టి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని దోచుకు తినటం కోసమే జగన్‌ ప్రభుత్వం కష్టమైన పనులు చేసిన వారిపై నిందలు వేస్తూ కాకమ్మ కథలు చెబుతున్నారు. పారిశ్రామిక వర్గాలు, రైతులు, మేథావులు జగన్‌ చర్యలను నిరసిస్తున్నారు" అని జవహార్‌ దుయ్యబట్టారు.దీనిపై మరింత చదవండి :