శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (15:34 IST)

కన్నబిడ్డపై అత్యాచారం చేసిన మానవమృగం (తండ్రి)

కంటికి రెప్పలా పెంచి పోషించాల్సిన తండ్రి కామంతో కళ్ళూమూసుకునిపోయి కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండలకేంద్రమైన జలదంకికి చెందిన ఓ బాలికపై కన్నతండ్రే గత మే, జూన్ నెలలో అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆ బాలిక భయపడిపోయింది. ఈ క్రమంలో ఆ బాలిక గర్భందాల్చింది. 
 
దీంతో తల్లికి అనుమానం వచ్చి నిలదీయగా, బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది. గత మే నెలలో నాన్న అత్యాచారం చేశాడనీ, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడంటూ బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది. 
 
దీంతో జరిగిన ఘోనాన్ని తలచుకుని కుమిలిపోయిన ఆ తల్లికి ఏం చేయాలో అర్థకాక గర్భస్రావం చేయించేందుకు కావలిలోని ఓ ఆసుపత్రికి తీసుకువచ్చింది. అబార్షన్‌ చేయాలని వైద్యులను కోరింది. అక్కడి వైద్యులు విషయం పోలీసులకు తెలియజేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
 
విషయం పోలీసుల వరకు వెళ్లిందని తెలియడంతో తప్పు చేసిన తండ్రి చెన్నై పారిపోయేందుకు ముసునూరు వద్ద వాహనం కోసం వేచి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురిపై అత్యాచారం చేసినట్లు అతను ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.