సంబంధిత వార్తలు
- ప్రత్యేక పూజల పేరుతో వివాహితపై పూజారి అత్యాచారయత్నం
- నకిలీ పత్రాలతో బాలికను పెళ్లాడిన అరబ్ షేక్.. ఐదు లక్షలు తిరిగిస్తేనే పంపుతానని?
- మాకు పదవులు - డబ్బు ముఖ్యం కాదు.. శృంగారమే ప్రధానం...
- శభాష్ కేసీఆర్.. 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి: రామోజీరావు కితాబు
- ఆ వార్తల్లో నిజం లేదు.. డిజైనర్‌గా నియమించలేదు : రాజమౌళి
మతపెద్ద ముసుగులో మోసాలు.. 1000 పెళ్లిళ్లు.. అందమైన అమ్మాయిల్ని షేక్‌లకు?
దాదాపు వెయ్యి పెళ్లిళ్లు చేసిన పాతబస్తీలో గ్రేటర్ చీఫ్ ఖాజీ రఫియా లీలలు వెలుగులోకి వచ్చాయి. మతపెద్ద ముసుగులో మోసాలు చేశాడు. డబ్బు కోసం రికార్డు స్థాయిలో 1000 కాంట్రాక్టు మ్యారేజీలు చేశాడు. అరబ్బు షే
దాదాపు వెయ్యి పెళ్లిళ్లు చేసిన పాతబస్తీలో గ్రేటర్ చీఫ్ ఖాజీ రఫియా లీలలు వెలుగులోకి వచ్చాయి. మతపెద్ద ముసుగులో మోసాలు చేశాడు. డబ్బు కోసం రికార్డు స్థాయిలో 1000 కాంట్రాక్టు మ్యారేజీలు చేశాడు. అరబ్బు షేకులెవరికైన కొత్త పెళ్లాం కావాలనిపిస్తే ఖాజీ రఫియాను సంప్రదిస్తారు.
అంతేవారు హైదరాబాదు ఎయిర్ పోర్టులో దిగింది మొదలు అన్నీ రఫియానే చక్కబెడతాడు. ఇందుకు తన ఏజెంట్లను నియమించుకున్నాడు. వారి పనేంటంటే... ముస్లిం బస్తీల్లో అందంగా ఉండే ముస్లిం యువతుల అడ్రస్ లు సంపాదించి, వారి తల్లిదండ్రులను ముగ్గులోకి లాగడమే.
ఇలా పేద ముస్లింలను టార్గెట్ చేసేందుకు ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. ఇలా అందాల ఆశ చూపించి.. రూ.70వేలు చేతిలో పెట్టి రూ.2,50,000లను ఏజెంట్లు తీసుకుంటారు. పెళ్లికి ఐదులక్షలు సుపారీ ఇస్తారు. ఇలా పేదరికాన్ని ఆసరాగా తీసుకుని వారిని వంచిస్తాడు. పెళ్లి కంటూ వచ్చే అరబ్ షేక్‌లు హైదరాబాదు వచ్చారంటే.. రోజుకి ఐదువేల రూపాయల అద్దెతో పాటు పెళ్లికి 5,00,000 రూపాయలు చెల్లించాల్సిందే. మిగతా కార్యక్రమాలన్నీ ఖాజీ రఫియా చూసుకుంటాడు. బాలిక తల్లిదండ్రులకు 70,000 రూపాయలు ఇస్తాడు. ఏజెంట్‌కు 2.50,000 రూపాయలు ఇస్తాడు. మిగిలింది ఖాజీ తన జేబులో వేసుకుంటాడు.
ఇలా ఇతని వద్దకు వివాహానికి 25 మంది షేక్‌లు వచ్చేవారంటే రఫియా పనితనం ఏ రీతిలో ఉండేదో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా ఐదేళ్లలోనే వెయ్యి పెళ్లిళ్లు చేశాడంటే షాకవుతారు. ఇది కేవలం హైదరాబాదు పాతబస్తీకి మాత్రమే పరిమితం కాదని, ముంబైలో కూడా కార్యాలయం ఓపెన్ చేశాడని, అక్కడ తనిఖీలు నిర్వహించిన తరువాత ఇతగాడి అసలు రంగు బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
