మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (09:41 IST)

మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు.. కాపురానికి రాలేదని ఏం చేశాడో వీడియోలో చూడండి

బాలికలపై దేశంలో దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కనిగిరి తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. మైనర్ బాలికను బలవంతంగా పెళ్లాడమే కాకుండా ఆమె కాపురానికి రాలేదని జుట్టుపట్టు ఈడ్చుకెళ్లిన ఘటన రాజస్థాన్‌లోని జ

బాలికలపై దేశంలో దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కనిగిరి తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. మైనర్ బాలికను బలవంతంగా పెళ్లాడమే కాకుండా ఆమె కాపురానికి రాలేదని జుట్టుపట్టు ఈడ్చుకెళ్లిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పట్టపగలే మైనర్ బాలికను ట్రాక్టర్‌లో కిడ్నాప్ చేయడం.. ఆమె తల్లి ప్రతిఘటించడంతో ఆ దుర్మార్గులు ఆమె తల్లిని చితకబాదారు. పట్టపగలే ఇంత జరుగుతున్నా.. ఎవ్వరూ అడ్డుకోలేదు. వివరాల్లోకి వెళితే జోధ్‌పూర్ జిల్లాలోని బ‌ప్ తెహ‌సిల్ గ్రామానికి చెందిన అహ్మ‌ద్ ఖాన్ త‌న కుమార్తెను ఢాణీ గ్రామానికి చెందిన షౌక‌త్‌కు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. 
 
వివాహం నాటికి ఆమెకు 16 సంవత్సరాలే. ఆ బాలిక‌కు, ఆమె త‌ల్లికి ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. దీనితో పెళ్ల‌యిన ఆరు నెల‌ల‌కే ఆ బాలిక పుట్టింటికి వ‌చ్చింది. అక్క‌డే ఉండి చ‌దువుకుంటోంది. త‌న భార్య‌ను కాపురానికి పంపించాలంటూ షౌక‌త్ ప‌లుమార్లు ఆమె త‌ల్లి నేమ్తా ఖాన్‌కు సూచించాడు. త‌న కుమార్తెకు ఇంకా మైనరేనని.. 18 ఏళ్లు దాటాక కాపురానికి పంపిస్తానని చెప్తూ వచ్చింది. 
 
ఆమె వైఖ‌రి న‌చ్చ‌ని షౌక‌త్‌.. త‌న భార్య‌ను ఎలాగైనా స‌రే కాపురానికి తీసుకోవాల‌ని నిర్ణ‌యించాడు. రెండు రోజుల కింద‌ట త‌న స్నేహితుడితో క‌లిసి ట్రాక్ట‌ర్‌పై నేమ్తా ఖాన్ గ్రామానికి వెళ్లాడు. ఆ స‌మ‌యంలో నేమ్తా ఖాన్‌తో పాటు ఆమె కుమార్తె వ్య‌వ‌సాయ ప‌నుల్లో ఉన్నారు. నేరుగా పొలం వ‌ద్ద‌కు వెళ్లిన షౌక‌త్ అక్క‌డే వారితో గొడ‌వ ప‌డ్డాడు. త‌న భార్య జుట్టుప‌ట్టుకుని లాక్కుని వెళ్లాడు. అడ్డొచ్చిన నేమ్తాను తీవ్రంగా కొట్టాడు. 
 
ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నేమ్తా ఖాన్ స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో షౌక‌త్‌పై ఫిర్యాదు చేసింది. త‌న కుమార్తెను కిడ్నాప్ చేశాడ‌ని లిఖిత‌పూర‌కంగా ఫిర్యాదు చేసింది. దీనితో షౌక‌త్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.