1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Cyclone alert heavy rain forecast in andhra pradesh

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను... ఏపీలో మళ్లీ వర్షాలు

mandous cyclone
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు "దానా" అని పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్న ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీ వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. 
 
ఈ అల్పపీడనం ఈ నెల 22వ తేదీ నాటికి వాయుగుండంగా, అక్టోబరు 23వ తేదీ నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 25వ తేదీన కోస్తాంధ్ర, యానాంలలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు, ఈ నెల 20, 24వ తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఈ నెల 20వ తేదీన రాయలసీమలో అక్కడక్కడ బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అందువల్ల జాలర్లలు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దళిత యువకుడు హత్య కేసు : వైకాపా మాజీ మంత్రి కుమారుడి హస్తం