1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. dk aruna serious warning to trs leaders

ఖబడ్దార్‌... నా కొడకల్లారా.... ఒక్కొక్కరి తాట తీస్తాం : డీకె అరుణ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఖబడ్దార్‌... నాకొడకల్లారా.... ఒక్కొక్కరి తాట తీస్తానంటూ హెచ

dk aruna
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఖబడ్దార్‌... నాకొడకల్లారా.... ఒక్కొక్కరి తాట తీస్తానంటూ హెచ్చరించారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ప్రజల మధ్య వర్గ విభేదాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకుల తాట వలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
 
గత కొన్ని రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఆగ్రహం వెళ్లగక్కిన ఆమె రాజకీయ ముసుగులో రౌడీల్లా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ స్పష్టం చేశారు. 'ఖబడ్దార్‌ నా కొడకల్లారా' అంటూ విరుచుకుపడ్డారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేని అరాచకాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.
 
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన మాట మొదలుకుని ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొలేని కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల పేరుతో మరోసారి ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఐదేళ్ల పాలన కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన చేతకానితనంతో అభాసుపాలు చేసిన కేసీఆర్‌కు తిరిగి ఓటు అడిగే హక్కులేదన్నారు. 
About Writer
pnr