1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Dying was visible before the eyes

కాటికి వెళ్లిందనుకుంటే కళ్లముందు ప్రత్యక్షమైంది... ప్రకాశం జిల్లాలో ఘటన

Dying
పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామానికి చెందిన 60 సంవత్సరాల తిరుమలరెడ్డి అచ్చమ్మ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయింది.

కుటుంబ సభ్యులు గాలించినా ఆమె జాడ తెలియలేదు. దీంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో చనిపోయి ఉంటుందని భావించారు. సమీపంలో కొండప్రాంతానికి గడ్డికి వెళ్తే ఏదైనా మృగం దాడిచేసి ఉండవచ్చని అనుమానించారు.

ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం అచ్చమ్మ భర్త వీరయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమెపై ఆశలు వదులుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె కర్నూలులో ఉన్నట్లు సమాచారం అందింది. అచ్చమ్మ కుమారుడు వీరనారాయణరెడ్డి, అతని సోదరుడు శివారెడ్డి కర్నూలు వెళ్లి అచ్చమ్మను ఇంటికి తీసుకువచ్చారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
బీజేపీకి మిత్రపక్షం వైసీపీ: పీసీసీ