వృద్ధుడితో భార్య ఏకాంతంగా ఉండటాన్ని చూసి...
సమాజంలో మానవసంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ముఖ్యంగా దాంపత్య బంధం మరింతగా బలహీనపడిపోతోంది. క్షణిక సుఖం కోసం ఆశపడే భార్యలు, భర్తలు తమ నిండునూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా వారి పిల్లలు అనాథలవుతున్నారు.
తాజా హైదరాబాద్ మహానగరంలోని బీఎన్ రెడ్డి నగర్‌లో ఓ వివాహిత వృద్ధుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వృద్ధుడు, ఆ వివాహిత శారీరకంగా కలిసివున్నపుడు ఆ మహిళ భర్త కళ్లారా చూశాడు.
దీన్ని జీర్ణించుకోలేని భర్త.. వృద్దుడుని చంపేశాడు. వృద్ధుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.