1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. flexi war at puttoor, rebel ysrcp workers blames mla roja

ఎమ్మెల్యే రోజా ఫెక్సీలు చింపేసింద‌ట‌! పుత్తూరులో వైసీపీ వ‌ర్గ‌పోరు!!

flexi war
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైకాపాలో వర్గపోరు వివాదాలు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రోజా వ్య‌తిరేక వ‌ర్గం పుత్తూరులో ఆందోళనలు ప్రారంభించింది. పుత్తూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంతో ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థి వర్గం ఆందోళనలు చేపట్టారు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
 
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైకాపాలో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈనెల 21న సీఎం జగన్​ జన్మదినం వేడుకలను పురస్కరించుకొని పుత్తూరు పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది చూసి ఓర్వలేక గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే వాటిని ధ్వంసం చేశారు. అయితే దీనికి నిరసనగా రోజా ప్రత్యర్థులు ఆందోళనకు దిగారు. 
 
తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే రోజానే ధ్వంసం చేయించిందని ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా దౌర్జన్యాలను అరికట్టాలనే నినాదాలతో హోరెత్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.
తర్వాతి కథనం
గవర్నర్ కు విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వానం