శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (12:53 IST)

బాలికలకు ఆ వీడియోలు చూపి.. లైంగికంగా వేధించాడు..

పెళ్లి సంబంధాలు కుదిర్చే మధ్యవర్తి.. మూడు నుంచి నాలుగేళ్ల బాలికలను లైంగికంగా వేధించాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన భాషా అనే మానవ మృగం... బాలికలకు నీలిచిత్రాలు చూపించి అదేలా ప్రవర్తించాడు. బాలికలకు మాయమా

పెళ్లి సంబంధాలు కుదిర్చే మధ్యవర్తి.. మూడు నుంచి నాలుగేళ్ల బాలికలను లైంగికంగా వేధించాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన భాషా అనే మానవ మృగం... బాలికలకు నీలిచిత్రాలు చూపించి అదేలా ప్రవర్తించాడు. బాలికలకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని ముగ్గురు బాలికలపై లైంగికంగా వేధించాడు. నవంబర్‌ నెలాఖరు నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. 
 
లైంగిక వేధింపుల విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని బెదిరించాడు. కానీ ఆదివారం కడుపులో నొప్పిగా వుందని ముగ్గురిలో ఓ బాలిక బాధపడుతుండగా, బాలిక తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమీప బంధువులైన మరో ఇద్దరి బాలికలతోనూ అదే విధంగా ప్రవర్తించాడని బాలిక తల్లితో చెప్పింది. 
 
ఈ ఘటనపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల నుంచి బాలలను రక్షించే చట్టం (పోక్సో) కింద జానీ బాషాపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.