1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Guntur crime news

వేరొక యువకుడితో ప్రేయసి షికార్లు.. ప్రశ్నించిన ప్రేమికుడు హతం.. ఎలా?

వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు-ఘోరాలు కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కరకట్ట వద్ద ఓ యువతి తన మాజీ ప్రియుడిని హ

Guntur
వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు-ఘోరాలు కూడా పెచ్చరిల్లిపోతున్నాయి.

తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కరకట్ట వద్ద ఓ యువతి తన మాజీ ప్రియుడిని హతమార్చి.. సెప్టిక్ ట్యాంకులో పడవేసింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గాయత్రి అనే యువతి రాజయ్యతో ప్రేమలో పడింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
 
అయితే మధ్యలో సుధాకర్ అనే యువకుడితో గాయత్రికి సంబంధం ఏర్పడింది. ఈ విషయం రాజయ్యకు తెలియరావడంతో మాజీ ప్రియుడితో గొడవపడింది. దీంతో ఇక లాభం లేదనుకున్న గాయత్రి.. సుధాకర్‌తో కలిసి రాజయ్యను చంపేసింది. మృతుడి కుటుంబ సభ్యులు రాజయ్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెప్టిక్ ట్యాంకులో రాజయ్య మృతదేహాన్ని కనుగొన్నారు. ఆపై జరిపిన దర్యాప్తులో గాయత్రి, సుధాకర్ నిందితులని తేలింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
About Writer
selvi
తర్వాతి కథనం
ఆ కారణాల వల్లే మా ఆయన రాలేకపోయారు: ఉపాసన