శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (16:27 IST)

ఇవాంకా గ్రీన్ గౌన్ బాగోలేదా..? రాధాకృష్ణుల స్ఫూర్తితో వారణాసి దారాలతో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ బుధవారం గోల్కొండ కోటను సందర్శించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు హాజరైన 1500మంది ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ బుధవారం గోల్కొండ కోటను సందర్శించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు హాజరైన 1500మంది ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి విందు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. 
 
అంతకుముందు యూఎస్‌ సీక్రెట్‌ ఏజెంట్స్‌ గోల్కొండ కోటలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు పోలీసులు గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కోట పరిధిలో రాత్రి పది గంటల వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గోల్కొండ కోట నుంచి హోటల్ వెళ్లిన ఇవాంకా ట్రంప్.. అక్కడ 46 నిమిషాల విశ్రాంతికి అనంతరం టీఆర్ఎస్ సర్కారు ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 9.20 గంటలకు ఇవాంకా దుబాయ్ బయల్దేరుతారు. కోటను సందర్శించిన ఇవాంకా గోల్కొండ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. 
 
ఇకపోతే.. జీఈఎస్ సదస్సు సందర్భంగా ఇవాంకా ధరించిన గ్రీన్ గౌన్ బాగోలేదని అంతర్జాతీయ మీడియా ఏకిపారేసిన నేపథ్యంలో.. ఆ డ్రెస్‌ను డిజైన్ చేసిన జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా స్పందించారు.
 
వారణాసి నుంచి తెప్పించిన నాణ్యతతో కూడిన దారాలతో దీన్ని తయారు చేశామన్నారు. అంతేగాకుండా ఇవాంక ధరించిన గ్రీన్ గౌన్‌ను బృందావన్ గార్డెన్స్‌లో కొలువైన రాధాకృష్ణుల దుస్తుల స్ఫూర్తితో తయారు చేశామని చెప్పుకొచ్చారు. ఇవాంకా కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయడం తనకు ఎంతో గౌరవం తెచ్చిందని, భారతీయత ఉట్టిపడేలా ఈ డ్రెస్‌ను రూపొందించామని తెలిపారు.