గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2017 (17:37 IST)

క్రికెట్లో సంచలనం: 17ఓవర్లలో 2 పరుగులు- తొలి బంతికే కేరళ గెలుపు

మహిళల అండర్-10 క్రికెట్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా నాగాలాండ్ జట్టుపై మొదటి బంతికే కేరళ జట్టు విజయం సాధించింది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కేవలం ర

మహిళల అండర్-10 క్రికెట్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా నాగాలాండ్ జట్టుపై మొదటి బంతికే కేరళ జట్టు విజయం సాధించింది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులకే నాగాలాండ్ కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో నాగాలాండ్‌ 17 ఓవర్లు ఆడి, కేవ‌లం 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ రెండు ప‌రుగుల్లో ఒక ప‌రుగుని ఓపెనర్ మేనక చేయ‌గా, మ‌రో ప‌రుగు వైడ్ రూపంలో ల‌భించింది.
 
కేర‌ళ బౌల‌ర్ల‌లో మిన్నూ మణి 4, సౌరభ్య 2, సంద్ర సురేన్, బిబీ సెబాస్టియన్ చెరో వికెట్ తీశారు. అనంత‌రం మూడు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన కేర‌ళ జట్టు ఒక్క బంతికే బౌండరీ సాధించి గెలుపును తన ఖాతాలో వేసుకుంది. కేరళ మహిళల ఆటతీరుపై క్రికెట్ స్టార్స్, ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.