శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (10:59 IST)

#AndhraPradesh : గుంటూరులో కుప్పకూలిన భవనం (వీడియో)

గుంటూరులో ఓ భవనం కుప్పకూలిపోయింది. జిల్లా కేంద్రంలోని నందివెలుగు సెంటర్‌లో శనివారం రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా పక్కనే ఉన్న మూడు అంతస్తుల భవంతి కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవిం

గుంటూరులో ఓ భవనం కుప్పకూలిపోయింది. జిల్లా కేంద్రంలోని నందివెలుగు సెంటర్‌లో శనివారం రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా పక్కనే ఉన్న మూడు అంతస్తుల భవంతి కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. 
 
కృష్ణా పుష్కరాల సమయంలో గుంటూరులోని ముఖ్యమైన రోడ్లను విస్తరించి లైట్లతో సుందరీకరించాలని అధికారులు నిర్ణయించారు. ఆ సమయం దాటిపోవడంతో ఆ పనులను అధికారులు నిలిపివేశారు. ఆ పనులను మళ్లీ మొదలుపెట్టారు. 
 
నందివెలుగురోడ్డులోని మణిహోటల్ సెంటర్‌లో రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న ఓ భవంతిని 60 శాతం మేర కూల్చేశారు. దీనికి సంబంధించి ఇంటి యజమానులకు నోటీసులు ఇవ్వడంతో వారు ముందుగానే ఖాళీచేశారు. రోడ్డు విస్తరణ పనులుచేస్తుండగా భవనం కుప్పకూలింది.