మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (13:14 IST)

30 సెకన్ల వ్యవధిలో 30సార్లు నరికారు.. చనిపోయాడో లేదోనని...

పాతకక్ష్యల నేపథ్యంలో గుంటూరులో దారుణ హత్య చోటుచేసుకుంది. రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39)పై నలుగురు దుండగులు దాడి చేశారు. 30 సెకన్ల వ్యవధిలో 30సార్లు నరికారు. అంతటితో ఆగకుండా చనిపోయాడో లేదో చూసుకుని..

పాతకక్ష్యల నేపథ్యంలో గుంటూరులో దారుణ హత్య చోటుచేసుకుంది. రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39)పై నలుగురు దుండగులు దాడి చేశారు. 30 సెకన్ల వ్యవధిలో 30సార్లు నరికారు. అంతటితో ఆగకుండా చనిపోయాడో లేదో చూసుకుని.. గొంతుకోశారు. ఆ తర్వాత వచ్చిన వాహనంలోనే పారిపోయారు. 
 
విద్యానగర్ నాలుగో లైన్లో నివాసం ఉండే వాసు.. మరికొందరితో కలిసి అరండల్ పేట 12వ లైన్ లోని ఓ బిర్యానీ పాయింట్‌కు వెళ్లి, డిన్నర్ ముగించుకుని వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని.. అనుమానిత నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యేకు దగ్గరి సన్నిహితుడైన వాసు.. ఇటీవలే ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉంటూ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం.