శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (09:38 IST)

రేవంత్‌ను కాంగ్రెస్ దూరంగా పెట్టింది.. వాళ్ల దగ్గరకెళ్లి ప్రాధేయపడ్డారు: రమణ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాలని ఆరు నెలల పాటు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. రేవంత్‌ను ఆహ్వాని

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాలని ఆరు నెలల పాటు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. రేవంత్‌ను ఆహ్వానించే విషయంలో మిగతా నాయకుల అభిప్రాయాలను స్వీకరించే నెపంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను దూరం పెట్టిందని వ్యాఖ్యానించారు. 
 
ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసివచ్చిన తరువాత, ఆయన తనను వ్యతిరేకిస్తున్న డీకే అరుణ, కోమటిరెడ్డి వంటి వారి దగ్గరికెళ్లి ప్రాధేయపడ్డారని రమణ  విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీని వీడాలని ఆయన ఎంతో ముందుగానే అనుకున్నారని, కాంగ్రెస్ కాకుంటే మరో పార్టీలోకి మారుండేవారని చెప్పుకొచ్చారు.
 
ఇదిలా ఉంటే తెలుగు దేశం పార్టీకి కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. శనివారం విజయవాడలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన పదవులతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేవంత్‌ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి అందచేశారు.
 
కాగా కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని.. పార్టీపై, పార్టీ అధ్యక్షుడిపై తనకు ఎంతో గౌరవం నుందని రేవంత్ రెడ్డి   తెలిపారు. తనను తక్కువ సమయంలో పార్టీ ఉన్నత పదవులను నిర్వహించేలా చేసిందని, తన ఎదుగుదలకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు తనకు తండ్రితో సమానమని, తాను ఎల్లప్పుడూ పార్టీ, కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తినని అన్నారు. 
 
ఏపీ, టీ-టీడీపీ సీనియర్లు తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నేతలతో చేతులు కలిపి టీటీడీపీని నాశనం చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. తాను కేసీఆర్‌పై పోరాటం చేస్తుంటే ఏపీ, టీ-టీడీపీకీ చెందిన నేతలు ఆయనతో కలిసి సమావేశం నిర్వహించారని, మరికొందరు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో లాలూచీపడి కాంట్రాక్టులు తెచ్చుకున్నారని తెలిపారు. అలాంటప్పుడు తన పోరాటానికి విలువ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.