మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 28 అక్టోబరు 2017 (14:49 IST)

బాబూ... ఇక ఇక్కడ చాలు... ఇదిగో నా రాజీనామా... రేవంత్ రెడ్డి

గత కొన్ని రోజులుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తీవ్రస్థాయి చర్చకు తెరలేపిన రేవంత్ రెడ్డి వ్యవహారం రాజీనామా లేఖతో దాదాపు తెరపడినట్లయింది. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. తెలంగాణ

గత కొన్ని రోజులుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తీవ్రస్థాయి చర్చకు తెరలేపిన రేవంత్ రెడ్డి వ్యవహారం రాజీనామా లేఖతో దాదాపు తెరపడినట్లయింది. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండుగా మంచి పేరుంది. ఐతే ఇటీవలి కాలంలో తెదేపాకు రివర్స్ గేర్లా మారారు. 
 
ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనితో ఆయన వ్యవహారంపై చంద్రబాబు నాయుడుకి టి.తెదేపా నాయకులు లేఖలు రాశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా లేఖలు రాశారు. కాగా సోమవారం నాడు రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడకు వచ్చారు. 
 
ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకు ఇచ్చినట్లు తెలిపారు. కానీ రాసిన లేఖ తనకు అందలేదని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. కాగా రేవంత్ రెడ్డి వ్యవహారంపై టి.తెదేపా నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు.