1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Revanth Reddy may join in Congress on November month

ఈ నెల 30న టిడిపికి రేవంత్ గుడ్ బై..? వచ్చే నెలలో కాంగ్రెస్ తీర్థం

ఇప్పుడు ఎక్కడ చూసినా టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి వ్యవహారమే హాట్ టాపిక్‌గా ఉంది. తెలుగుదేశం పార్టీలో తెలంగాణా రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డి చివరకు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారితీస్తోంది. నేషనల్ మీడియా కూడా రేవంత

Revanth Reddy
ఇప్పుడు ఎక్కడ చూసినా టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి వ్యవహారమే హాట్ టాపిక్‌గా ఉంది. తెలుగుదేశం పార్టీలో తెలంగాణా రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డి చివరకు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారితీస్తోంది. నేషనల్ మీడియా కూడా రేవంత్ వ్యవహారాన్ని బాగానే ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి తిరిగొచ్చిన రేవంత్ రెడ్డికి తెలంగాణాలో టిడిపి నేతల నుంచి ఇబ్బందులు తప్పలేదు.
 
మొదట మోత్కుపల్లి గొడవకు దిగితే ఆ తరువాత రమణ ఏకంగా రేవంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చంద్రబాబుకు లేఖ రాశారు. విదేశీ పర్యటనలో ఉన్న తాను వచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని, రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించి సొంత సమావేశాలు పెట్టకూడదని ఇప్పటికే రమణ లేఖకు సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి మాత్రం తాను ఏదైనా సమాధానం చెప్పాలంటే అది బాబుకు మాత్రమేనని వెల్లడించాడు. 
 
అయితే టి.టిడిపి నేతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఈ నెల 30న పార్టీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట రేవంత్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం వచ్చే నెల చేరనున్నారు. అది కూడా రాహుల్ గాంధీ సమక్షంలోనే అని చెప్పుకుంటున్నారు.
తర్వాతి కథనం
ఆటో డ్రైవర్ లైంగిక దాడి.. ప్రతిఘటించిన అక్కాచెల్లెళ్లు.. కానీ ఇనుప్ రాడ్‌తో?