శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (14:08 IST)

చంద్రబాబు తిరిగొచ్చేలోపు పార్టీని నాశనం చేసేలా ఉన్నారు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఓ ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత.. బయటకొస్తున్న నేతలకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ ఎదురుపడ్డారు. ఆసమయంలో రేవంత్‌ను చూసిన

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఓ ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత.. బయటకొస్తున్న నేతలకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ ఎదురుపడ్డారు. ఆసమయంలో రేవంత్‌ను చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్‌కమ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. సంపత్ కుమార్ అయితే, ఏకంగా ఆలింగనమే చేసుకున్నారు. ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి అయితే స్వాగతం టూ కాంగ్రెస్ అంటూ ఆహ్వానించారు. దీంతో అక్కడ ఉన్నవారిలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. 
 
కాగా, టీడీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేలోపే తెలంగాణలో టీడీపీని నాశనం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రెడ్డి. తనను వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ఎస్ఎంఎస్ పంపిచారని చెప్పారు.
 
కేసీఆర్‌పైనే తాను పోరాటం చేస్తున్నాననీ.. జరుగుతున్న పరిణామాలు చూస్తే.. కేసీఆర్ నెత్తిన పాలు పోసేలా ఉన్నాయన్నారు. కేడర్‌ను చూస్తుంటే బాధగా ఉందన్నారు. చంద్రబాబు వచ్చాక అన్నీ చెబుతా అని అన్నాకూడా మీడియా ముందు, పార్టీ ముందు తనను కొందరు విమర్శిస్తున్నారనీ.. వారిని పార్టీ నాయకత్వం నియంత్రించలేక పోతోందని రేవంత్ రెడ్డి అన్నారు. కేడర్ ఏది కోరుకుంటే పార్టీ అది చేయాలి గానీ.. వాళ్ల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేయడం సరైన చర్య కాదన్నారు.