శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr

టీడీఎల్పీ భేటీ కొనసాగితీరుతుంది : రేవంత్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష(టీటీడీఎల్పీ) సమావేశం ముందుగా ప్రకటించినట్టుగానే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగి తీరుతుందని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష(టీటీడీఎల్పీ) సమావేశం ముందుగా ప్రకటించినట్టుగానే గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగి తీరుతుందని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాన్ని అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికీ లేదన్నారు. ముఖ్యంగా, శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తమ అధినేత చంద్రబాబు స్వదేశానికి తిరిగి వచ్చేంతవరకు ఎవరితోనూ మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పారు. తనపై చంద్రబాబు ఎంతో నమ్మకాన్ని ఉంచారన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో గురువారం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు.