శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (18:21 IST)

ఎన్టీఆర్‌పై 3 బయోపిక్‌లు: చంద్రబాబుగా జేడీనా.. నో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవితంపై మూడు సినిమాలు తెరకెక్కనున్నాయి. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ '' లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించాడు. నందమూరి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవితంపై మూడు సినిమాలు తెరకెక్కనున్నాయి. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ '' లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించాడు. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు తేజ కాంబోలో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్-3 సిద్ధమవుతోంది.
 
తాజాగా, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, తాను కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు ప్రకటించారు. తన చిత్రంలో సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ కీలక పాత్రను పోషిస్తుందని చెప్పారు. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతల్లోనూ వాణీ విశ్వనాథ్ పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో అత్యంత కీలకమైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రను జేడీ చక్రవర్తి పోషించనున్నాడని వస్తున్న వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన చిత్రంలో చంద్రబాబు పాత్రను జేడీ పోషించడం లేదని ఫేస్ బుక్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.