ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (16:20 IST)

రేవంత్‌పై వేటుకు సర్వం సిద్ధం.. చంద్రబాబు రాకే తరువాయి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు స్వదేశానికి రాగానే వేటు నిర్ణయాన్న

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు స్వదేశానికి రాగానే వేటు నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ విషయంపై ఆయన బుధవారం ఓ స్పష్టత ఇచ్చారు. 
 
గురువారం టీడీఎల్పీ సమావేశాన్ని రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా నేతలందరికీ లేఖలు పంపారు. అయితే, పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ సమావేశం నిర్వహించడానికి వీల్లేదంటూ ఎల్. రమణ ఆదేశించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా దూరంగా ఉండాలని ఆయన కోరారు. 
 
ఆయన వ్యవహారంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. లండన్‍‌లో ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ కోసం ఏ నిర్ణయమైనా తీసుకోవాలని  రమణకు చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు.