శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 23 అక్టోబరు 2017 (15:59 IST)

రేవంత్‌కి అది కాస్త ఎక్కువ... అమరనాథ్, బండారం బయటపెడ్తా... పయ్యావుల

తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీలోని సీనియర్ నేతలను హేళనగా రేవంత్ రెడ్డి మాట్లాడటంపై ఎపి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డి ఫైరయ్యారు. రేవంత్ రెడ్డికి కాస్త నోరెక్కువ. ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు. ఏది పడితే అది మాట్లాడి మన పరువు మనమే తీసుకోవడం

తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీలోని సీనియర్ నేతలను హేళనగా రేవంత్ రెడ్డి మాట్లాడటంపై ఎపి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డి ఫైరయ్యారు. రేవంత్ రెడ్డికి కాస్త నోరెక్కువ. ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు. ఏది పడితే అది మాట్లాడి మన పరువు మనమే తీసుకోవడం మంచిది కాదు. ఎవరితోనైనా ఒకేరకంగా మాట్లాడితే అందరికీ మంచిదన్నారు అమరనాథ రెడ్డి.
 
రేవంత్ రెడ్డి పార్టీ వదిలిపోయే అవకాశం లేదని, ఇదంతా మీడియా సృష్టేనన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు తిరిగొచ్చిన తరువాత రేవంత్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడతారని చెప్పారు. కాగా పయ్యావుల కేశవ్ కూడా చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాక రేవంత్ రెడ్డి బండారం బయటపెడతానంటూ చెప్పిన సంగతి తెలిసిందే.