శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (09:25 IST)

రేవంత్ రెడ్డి పార్టీలోకి వస్తున్నారని నాకెవ్వరూ చెప్పలేదు: పొంగులేటి సుధాకర్

టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నట్లు తనకెవరూ చెప్పలేదని శాసనమండలి కాంగ్రెస్ ఉప నేత పొంగులేటి సుధాకర్ అన్నారు. గతంలో రాజీవ్‌ను ఉరి తీయాలని అన్న వారే ఆ తర్వాత పార్టీలో ఉన్నత పదవ

టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నట్లు తనకెవరూ చెప్పలేదని శాసనమండలి కాంగ్రెస్ ఉప నేత పొంగులేటి సుధాకర్ అన్నారు. గతంలో రాజీవ్‌ను ఉరి తీయాలని అన్న వారే ఆ తర్వాత పార్టీలో ఉన్నత పదవులు అందుకున్నారని గుర్తు చేశారు. పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా గతంలో పార్టీపై చేసిన వ్యాఖ్యలకు ఉపసంహరించుకుంటున్నామని చెప్పి మరీ రావాల్సి వుంటుందని తేల్చి చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు.
 
అయితే టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నాడని ఆ పార్టీ విప్ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేవారు తప్పకుండా తమ పార్టీలోకి వచ్చి తీరుతారని సంపత్ స్పష్టం చేశారు. రాజకీయంగా పరిపక్వత ఉన్నవారు మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటారన్నారు.  
 
మరోవైపు.. కాగా, టీడీపీ నేత రేవంత్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్న వార్తలతో ఆ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా యువనేతలు జోష్‌తో కనబడుతున్నారు. కొందరైతే రేవంత్ అప్పుడే కాంగ్రెస్‌లోకి వచ్చేసినట్టు బ్యానర్లు కూడా కట్టేస్తున్నారు.