బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (09:05 IST)

రేవంత్ రెడ్డి జంపింగ్‌తో ఖాళీకానున్న తెలంగాణ టీడీపీ

తెలంగాణ రాష్ట్రంలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఆయన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పైగా, ఆయనతో పాటు పార్టీ మారేవార

తెలంగాణ రాష్ట్రంలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఆయన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పైగా, ఆయనతో పాటు పార్టీ మారేవారు ఎవరన్న విషయమై గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికిపుడు రేవంత్ రెడ్డి పార్టీ మారితే కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులతో పాటు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
దీంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర టీడీపీకి తక్షణం టీటీడీపీ పాలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. దీంతో శుక్రవారం ఉదయం తెలంగాణలో టీడీపీ పాలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల నుంచి ఫిరాయింపులు అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది.