బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (19:21 IST)

కేసీఆర్‌కు మర్యాదలు చేస్తే తప్పేంటి...? రేవంత్ వీడినా ఫర్లేదు...

ఏపీ తెదేపా నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మర్యాదలు చేస్తే తప్పేంటి అని రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలపై స్పందించారు తెదేపా అధికార ప్రతినిధి అరవింద్ కుమార్. పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమం

ఏపీ తెదేపా నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మర్యాదలు చేస్తే తప్పేంటి అని రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలపై స్పందించారు తెదేపా అధికార ప్రతినిధి అరవింద్ కుమార్. పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా మర్యాద చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకాల్సిన బాధ్యత వుందని చెప్పుకొచ్చారు. మరి ఇందులో రేవంత్ రెడ్డికి కనబడిన తప్పేంటో తెలియడం లేదన్నారు.
 
ఇక రేవంత్ రెడ్డి తెదేపాను వీడి పోతారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ దీనిపై రేవంత్ రెడ్డే క్లారిటీ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీ అదే పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన వివరించారు. పార్టీ ఎప్పుడూ వ్యక్తులపై ఆధారపడి పనిచేయదనీ, కార్యకర్తలు, ప్రజల వెన్నుదన్నుతోనే ముందుకు సాగుతుందన్నారు. ఒకవేళ పార్టీని రేవంత్ రెడ్డి విడిచిపెట్టి వెళ్లిపోయినా పెద్దగా జరిగే నష్టమేమీ లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు.