సోమవారం, 16 మార్చి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 ఫిబ్రవరి 2026 (14:15 IST)

Chaddannam: మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఫలితం ఏంటి?

Chaddannam
Chaddannam
చద్దన్నం కేవలం ఒక సాధారణ ఆహారం కాదు.. పోషకాల గని. ఒకటి రాత్రి మిగిలిపోయిన అన్నంతో తయారుచేసే చద్దన్నం. ఈ అన్నంలో మజ్జిగ లేదా పెరుగు కలిపి నానబెడతారు. వాటికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చేర్చి తీసుకుంటారు. వండుకున్న అన్నం తినగా మిగిలిపోయిన అన్నం అయిదారు గంటల్లో చల్లబడి బ్యాక్టీరియా చేరి చద్ది అన్నం అవుతుందని.. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారానికి బదులుగా చద్దన్నం తీసుకోవడం వల్ల పొట్ట తేలికగా ఉండడమే కాదు. రోజంతా శక్తివంతంగా పనిచేయగలుగుతారు. 
 
దీనికి కారణం చద్దన్నంలో ఉండే లాక్టిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం వంటి విలువైన పోషకాలు. సాధారణంగా వేడి అన్నంలో కన్నా చద్దన్నంలో 60% క్యాలరీలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. ఇందులో బి6, బి12 విటమిన్లు వున్నాయి. చద్దన్నం తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను నివారించుకోవచ్చు. 
 
చద్దన్నం తినడం వల్ల ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. శరీరంలో వేడిని చద్దన్నం తగ్గిస్తుంది. ప్రతిరోజు చద్దన్నం తినేవారిలో రక్తపోటు అదుపులో వుంటుంది. మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఎముకలకు సంబంధించిన రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చు. కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చునని పోషకాహార నిపుణులు అంటున్నారు.