1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. HIV epidemic explodes in popular honeymoon destination as crystal meth use surges

పాపులర్ హనీమూన్ స్పాట్ ఇపుడు హెచ్.ఐ.వి కేంద్రంగా మారిపోతోంది?

fiji tourist spot
ప్రపంచంలో పాపులర్ హనీమూన్ కేంద్రాలుగా ఉన్న వాటిలో పసిఫిక్ దేశమైన ఫిజీ ఒకటి. ఇక్కడ ఉండే బీచ్‌లు, ప్రకృతి అందాలు, రిసార్టులతో ఫిజీ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. అలాంటి విహార కేంద్రం ప్రస్తుతం ఈ స్పాట్‌ కాస్త ఇపుడు హెచ్.ఐ.వి కేంద్రంగా మారిపోతోంది. ఈ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 
 
ప్రపంచ ఆరోగ్య గణాంకాల  ప్రకారం ఫిజీలో 2024లో 1583 హెచ్.ఐ.వి. కేసులో నమోదయ్యాయి. 2025లో తొలి ఆరు నెలల్లోనే 1226 కేసులు వెగులు చూశాయి. అంతకుముందు యేడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపుగా వుంది. దీంతో ఫిజీ పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం బ్లూటూత్ ట్రెండ్ అనే వైరస్ కారణంగా ఉందని ఫిజీ ఆరోగ్య శాఖ పేర్కొంది. 
 
డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బులు లేనివారు మత్తు కోసం అప్పటికే వాటిని తీసుకున్న వ్యక్తుల నుంచి రక్తాన్ని ఎక్కించుకోవడమే ఈ ట్రెండ్. క్రిస్టల్ మెథ్ డ్రగ్ వాడకం ఈ పరిస్థితి కారణమైంది. ఇలా ఒకరి రక్తాన్ని మరొకరు ఎక్కించుకోవడానికి అసురక్షిత పద్దతులను అనుసరిస్తుండటంతో హెచ్.ఐ.వి వ్యాపిస్తోంది. 
 
ఈ డ్రగ్స్ మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రిస్తాయని, దాని ప్రభావంతో ఉన్న వ్యక్తులు దుందుడుకుగా ప్రవర్తించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫిజీలో హెచ్.ఐ.వి వ్యాప్తి అనేది ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు. ఇది సహజ పురోగతిని దెబ్బతీసే ఒక ముప్పు అని యూఎస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 
తర్వాతి కథనం
మద్యం మత్తులో ప్రాణం తీసిన వ్యసనం.. సిగరెట్ సెగకు మాజీ సైనికుడు మృతి